మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే, నిందితులపై ఫోక్స్ యాక్ట్, సెక్షన్ 5జీ 6 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పుకొచ్చారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారంపై u/s 452, 324, 376-DA, 506 IPC, సెక్షన్.. 5(Gr/w 6 of POCSO) చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
Read Also: Rashmika Mandanna: ఇంత క్యూట్ గా సెల్ఫీలు తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోతారు..
అయితే, లాల్‌బజార్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో తన సోదరుడితో కలిసి మీర్‌పేటలో ఉంటుంది. బాధిత బాలిక ఇంట్లో ఉన్నా సమయంలో నిందితుడు అబేద్ తన స్నేహితులు తహసీన్( టైసన్ )తో కలిసి మైనర్ ఇంట్లోకి వెళ్లాడు. నిందితుడు అబేద్ సదరు బాలికను బెడ్‌రూమ్‌లోకి లాగి, జుట్టు పట్టుకుని, ఆమె నోరు గట్టిగా మూసి బలవంతంగా అత్యాచారం చేసిన తర్వాత.. కత్తి చూపించి బాలికపై వరుసగా నలుగురు సామూహిక అత్యచారం చేశారు అని సీపీ చౌహాన్ తెలిపారు.
Read Also: VV Lakshminarayana: మళ్లీ పోటీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. ఈ సారి..!
ఇక, మైనర్ బాలికకు ప్రధాన నిందితుడు ఆబెద్ ముక పరిచయం ఉందని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. గతంలో మైనర్ బాలికను ప్రధాన నిందితుడు ఆబెద్ ఫోర్స్ చేశాడు.. నిందితులు గంజాయి తీసుకున్నట్లు తెలుస్తుందని సీపీ పేర్కొన్నారు. A1 అబేద్ బిన్ ఖాలీద్, A2 తెహసీన్, A3 మంకాల మహేష్ కీలక నిందితులుగా ఉండగా.. వారికి సహకరించిన సహా నిందితులు.. A4 నర్సింగ్, A5 అశ్రఫ్, A6 ఫైజల్, A7 ఇమ్రాన్ గా గుర్తించారు. ఇక, A-2 తహసీన్ పరారీలో ఉన్నాడని రాచకొండ సీపీ చెప్పాడు.
Read Also: Tomato: క్వింటాళ్ల కొద్దీ టమోటాలు లూఠీ.. పోలీసులు వచ్చేసరికి ఖాళీ
A1 అబేద్ మంగళ్ హాట్ లో రౌడీషీట్ అని సీపీ చౌహాన్ పేర్కొన్నాడు. A4 నర్సింగ్, అశ్రఫ్ అత్యాచారం సమయంలో ఇతర పిల్లలను బెదిరించారు.. నిందితులు పారిపోడానికి ఫైజల్, ఇమ్రాన్లు సహకరించారు.. సెల్ ఫోన్ పడేసి సిగ్నల్ దొరకకుండా పరారయ్యారు.. అమ్రాబాద్ పారిపోతుండగా పాతబస్తీ సంతోష్ నగర్ వద్ద అరెస్ట్ చేశామని సీపీ చౌహాన్ వెల్లడించారు. నందనవనం దగ్గర సమస్యలు మా దృష్టికి వచ్చాయి.. అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. బాలిక ఆరోగ్య పరిస్తితి బాగానే ఉంది.. వైద్య పరీక్షలు నిర్వహించామని సీపీ డీఎస్ చౌహన్ అన్నారు.
Read Also: Dil Raju: హార్ట్ కింగ్.. చరణ్ ఫ్యాన్స్ హార్ట్ ను విరిచేశాడే
నిందితుల పేర్లు
A1) అబేద్-బిన్-ఖాలీద్ @ అబిద్. S/a ఖలియా-బిన్-బాదర్.
A2) తహ్సీన్- పరారీలో ఉన్నాడు
A3) మాంకాలా మహేశ్S/o శ్రీను.
A4) M. నర్సింగ్ @ బ్యాండ్ చిన్నా,
A5) అష్రఫ్ S/o ఇబ్రహీం
A6) Md. ఫైజల్, S/o Md. రషీద్.
A7) Md. ఇమ్రాన్ S/o హనీఫ్