Rashmika Mandanna: ఇంత క్యూట్ గా సెల్ఫీలు తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగుతో పాటుగా బాలివుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు నెట్టింట ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో రష్మిక స్టైల్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి.
ఇక ఈ బ్యూటీకి కొరియన్ లంటే విపరీతమైన ఇష్టం. అందుకే అభిమానుల ముందుకు వచ్చిన ప్రతిసారి వేళ్లతో హార్ట్ సింబల్ చూపిస్తుంటుంది. ఇక సెల్ఫీ తీసుకోవడంలో.. కెమెరాలకు ఫోజులివ్వడంలోనూ విభిన్నంగా ఆలోచిస్తుంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. గతంలో కిస్సింగ్ ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలాగే మరోసారి ఫ్లైయింగ్ కిసింగ్ చేస్తూ సెల్ఫీ తీసుకుంది. అందులో రష్మిక ఫేస్ కొద్దిగానే కనిపిస్తుంది. నాకు సెల్ఫీ ఎలా తీసుకోవాలో తెలియదు. అందుకే ఇలా అంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఆ పిక్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది…
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో సెల్ఫీస్ షేర్ చేస్తుంది.అందులో ఎక్కువ శాతం రష్మిక తన కెమెరాకు కిస్ ఇస్తున్నట్లుగా ఫోజులిస్తుంది. అలాగే మనోహరమైన, ప్రశాంతమైన మనస్సుతో అభిమానులను పలకరిస్తుంటుంది.. కెమెరా ముందుకు వచ్చినప్పుడు వెరైటీగా పోజులు ఇస్తుంది.. రష్మిక ప్రస్తుతం పుష్ప 2చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా కనిపంచనుండగా.. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే బాలివుడ్ మూవీలలో కూడా నటిస్తుంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!