Site icon NTV Telugu

Meera Kumar : తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి

Meera Kumari

Meera Kumari

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో వేడుకలను ప్లాన్‌ చేసింది కాంగ్రెస్. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీరా కుమార్‌ మాట్లాడుతూ.. నాకు తెలుగులో మాట్లాడాలని ఉంది. తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది. మా నాన్న ఇక్కడికి వచ్చేవారు. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉంది. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేశామని, రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు.

Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు

రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉందని, తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, మీరు ఎప్పుడు పిలిచినా ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తానని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆమె ఉద్ఘాటించారు.

Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం

Exit mobile version