Meenakshi Chaudhary : జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా చిరునవ్వు చిందించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హరియాణాకు చెందినఈ భామ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అందులో ఆమె రన్నరప్‌గా నిలిచారు. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా తో ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమం అయింది.. ఆ సినిమాలో సుశాంత్ హీరో గా నటించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత మాస్ మహా రాజా రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్ తో హీట్ పుట్టించింది. ఆ తరువాత అడివి శేష్ సరసన నటించిన ‘హిట్ 2’తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా మీనాక్షి కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.. మీనాక్షి ప్రస్తుతం ‘గుంటూరు కారం’సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది.దీనితోపాటు ఆమె విశ్వక్సేన్, వరుణ్‌తేజ్‌తో సినిమాలలో కూడా నటిస్తుంది.గుంటూరు కారం’సినిమాలో అనుకోకుండా పూజ హెగ్డే తప్పుకోవడంతో మీనాక్షి కి బంపర్ ఆఫర్ వచ్చినట్లు అయింది.
నటి మీనాక్షి చౌదరి సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తనకు సంబంధించి ఏదొక పోస్ట్ పెడుతుంది.ఈ భామ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.కష్టం, లేదా సుఖం.. పరిస్థితి ఏదైనా సరే చిరునవ్వుతో ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో భావోద్వేగాలతో నా జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. ఇలాంటి దశలను నేనెప్పుడూ కూడా అనుభూతి చెందలేదు. కిందపడ్డా, ప్రయత్నించా, మళ్లీ తిరిగి లేచా.. ఇలా నా జీవితం సాగింది. ఆత్మ పరిశీలనతో నా జీవితాన్ని చూసే విధానం మారింది. ఇక, ప్రతి దశలోనూ ఈ చిరునవ్వు నాకు తోడుగా ఉంది. కాలంతోపాటు పరిస్థితులు కూడా మారతాయనే విషయాన్ని అదే నాకు అర్థమయ్యేలా అయితే చేసింది. కాబట్టి, జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే.. చిరునవ్వు చిందించిన క్షణాలను గుర్తు చేసుకోండి” అని ఆమె పోస్ట్ చేసారు.ఆ పోస్ట్ లో పలు ఫొటోలను ఆమె అభిమానులకు షేర్ చేసింది.. ఇందులోని ప్రతి ఫొటోలో కూడా మీనాక్షి నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించింది..
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!