CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.
మేడారంలో ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. వారి సంప్రదాయంలో ఏమాత్రం మార్పు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Hong Kong Sixes 2025: టీమిండియా కెప్టెన్గా దినేష్ కార్తీక్.. అలా ఎలా అంటే?
ఆలయ అభివృద్ధిని డబ్బులతో కాకుండా భక్తితో చూడాలని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా పనులు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని, పనులను పూర్తి చేసే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. అలాగే నిర్మాణాలు రాతి కట్టడాలతో ఉండేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు
ఇంకా ఆలయ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నానని ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డ నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని, అమ్మవార్ల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆదివాసీల పోరాటానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని కొనియాడారు. చివరగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పూజారులను సత్కరించారు. అలాగే ఆయన నిలువెత్తు బంగారాన్ని (68 కేజీల బెల్లం) అమ్మవారికి సమర్పించారు.
