MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్
- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.
- నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 25,652 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 12,472 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. అలాగే, సిద్ధిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 32,589 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: ENG vs AFG: ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం..
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
మరోవైపు, మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులున్నారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో 2,690 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో 1,347 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సిద్ధిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 3,212 మంది టీచర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, స్వేచ్ఛగా ఓటేయాలని ఎన్నికల అధికారులు కోరారు.
గత 20 రోజులుగా వివిధ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్ని తాయిలాలు ప్రకటించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం సమగ్ర వ్యూహాలు రచించాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న జరుగుతుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!