NTV Telugu Site icon

Mayawati: సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి

Mayawati

Mayawati

బీఎస్పీ అధినేత్రి మాయావతి రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు సంబంధించి తన స్టాండ్‌ను సమర్పించారు. ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్‌లో క్రీమీలేయర్‌, సబ్‌ కేటగరైజేషన్‌ అమలుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరిగా వాదించలేదన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాల్సి ఉండగా అది జరగలేదన్నారు. ఉద్యోగాలను తొలగించడం, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం రిజర్వేషన్లను అంతం చేసే ప్రయత్నమని మాయావతి అన్నారు.

READ MORE: Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్‌ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్‌ పిచాయ్‌

బీజేపీ, కాంగ్రెస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో కూడా ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాయావతి డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్‌పి, ఆప్‌లు రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రిజర్వేషన్లను కాపాడుకోవడం అంటూ తమ సీట్లను పెంచుకున్నాయని మండిపడ్డారు. ఈ పార్టీలు కూడా ఇప్పుడు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కుల గణనకు సంబంధించి కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలకు ఇవ్వకుండా కుల గణనను స్వయంగా నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు.