NTV Telugu Site icon

Yo-Yo Test: విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్ గిల్ కన్నా తోపు.. ఈ సన్‌రైజర్స్ స్టార్ యో-యో స్కోరు ఎంతో తెలుసా?

Mayank Agarwal Yo Yo Test

Mayank Agarwal Yo Yo Test

Mayank Agarwal beats Virat Kohli and Shubman Gill’s Yo-Yo Test Score: భారత జాతీయ జట్టులో చోటు దక్కాలంటే ఏ ఆటగాడైనా బీసీసీఐ నిర్వహించే ‘యో-యో’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుత యో-యో టెస్ట్ ఉత్తీర్ణత స్కోరు 16.5. ప్రతి సిరీస్ ముందు భారత ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహిస్తుంటుంది. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక వెళ్లే ముందు ప్లేయర్లు అందరికీ ఈ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు. ఇందుకు సంబందించిన స్కోరును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. యో-యో టెస్టులో తాను 17.2 స్కోర్ సాధించినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

ఆసియా కప్ 2023 కోసం నిర్వహించిన యో-యో టెస్టులో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యధిక స్కోర్ సాధించాడు. గిల్ ఏకంగా 18.7 స్కోర్ సాధించాడు. ఇది ఫిట్‌నెస్ రారాజు విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ కావడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా మరో భారత ప్లేయర్ గిల్ యో-యో టెస్టు స్కోరునే బీట్ చేశాడు. ఏకంగా 21.1 పాయింట్ల స్కోరు సాదించాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్.

Also Read: IND vs SL: భారత్, శ్రీలంక మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌! వీడియో వైరల్

ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కని మయాంక్ అగర్వాల్ ఇటీవల ముగిసిన మహారాజా ట్రోఫీలో మెరిశాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో రాణించి.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో యో-యో టెస్టులో తనకు 21.1 స్కోరు వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను మయాంక్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘కోహ్లీ, గిల్ కన్నా.. నువ్వే తోపు’, ‘మయాంక్ రికార్డును బద్దలు కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా?’, ‘అది సన్‌రైజర్స్ దెబ్బ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments