Yo-Yo Test: విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కన్నా తోపు.. ఈ సన్‌రైజర్స్ స్టార్ యో-యో స్కోరు ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Agarwal beats Virat Kohli and Shubman Gill’s Yo-Yo Test Score: భారత జాతీయ జట్టులో చోటు దక్కాలంటే ఏ ఆటగాడైనా బీసీసీఐ నిర్వహించే ‘యో-యో’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుత యో-యో టెస్ట్ ఉత్తీర్ణత స్కోరు 16.5. ప్రతి సిరీస్ ముందు భారత ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహిస్తుంటుంది. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక వెళ్లే ముందు ప్లేయర్లు అందరికీ ఈ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు. ఇందుకు సంబందించిన స్కోరును స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. యో-యో టెస్టులో తాను 17.2 స్కోర్ సాధించినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
ఆసియా కప్ 2023 కోసం నిర్వహించిన యో-యో టెస్టులో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యధిక స్కోర్ సాధించాడు. గిల్ ఏకంగా 18.7 స్కోర్ సాధించాడు. ఇది ఫిట్‌నెస్ రారాజు విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ కావడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా మరో భారత ప్లేయర్ గిల్ యో-యో టెస్టు స్కోరునే బీట్ చేశాడు. ఏకంగా 21.1 పాయింట్ల స్కోరు సాదించాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
Also Read: IND vs SL: భారత్, శ్రీలంక మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్! వీడియో వైరల్
ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కని మయాంక్ అగర్వాల్ ఇటీవల ముగిసిన మహారాజా ట్రోఫీలో మెరిశాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో రాణించి.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో యో-యో టెస్టులో తనకు 21.1 స్కోరు వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను మయాంక్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘కోహ్లీ, గిల్ కన్నా.. నువ్వే తోపు’, ‘మయాంక్ రికార్డును బద్దలు కొట్టే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా?’, ‘అది సన్‌రైజర్స్ దెబ్బ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!