Site icon NTV Telugu

Physical abuse: బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి శారీరక వేధింపులు..

Uttara Khand

Uttara Khand

ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదర్సాలో మతగురువు (మౌల్వీ) దారుణానికి ఒడి గట్టాడు. ఐదుగురు బాలికలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరక దోపిడీకి పాల్పడ్డాడు. మౌల్వీ చేసిన ఈ నీచమైన చర్యను ఐదుగురు బాలికలు బయటపెట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వారే కాకుండా.. ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇతర బాలికల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో వరదలు.. 13 మంది మృతి

ఆగస్ట్ 17న.. మౌల్వీ షబ్బీర్ రజాపై జెహనాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఒక మహిళ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. మసీదులోనే ఒక గదిలోనే నిర్మించిన తాత్కాలిక మదర్సాలో షబ్బీర్ రజా పిల్లలకు ధార్మిక విద్యను నేర్పించేవాడని తెలిపింది. అయితే.. తన ఎనిమిదేళ్ల కూతురు కూడా మదర్సాలో చదివుతుండేదని చెప్పింది. కొన్ని రోజులుగా.. తన కుమార్తె మదర్సా నుండి ఇంటికి వచ్చిన తర్వాత మౌనంగా ఉండేదని తెలిపింది. ఏంటా అని ఆరా తీయక మౌల్వీకి సంబంధించిన ఆగడాలను తన కూతురు బయటపెట్టింది. పెద్ద పిల్లలు మదర్సా నుండి వెళ్లిన తర్వాత.. మౌల్వీ తనతో పాటు నలుగురు అమ్మాయిలను గదికి తీసుకువెళతారని.. అక్కడ తన మొబైల్‌లో డర్టీ వీడియోలు చూపిస్తారని చెప్పింది. అంతేకాకుండా.. తాకరాని చోట కూడా తాకేవాడని బాలిక తల్లికి చెప్పింది. ఈ విషయాన్ని తల్లి బయటపెట్టింది. ఈ క్రమంలో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?

ఈ కేసులో ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట ఫిర్యాది కుమార్తె వాంగ్మూలం ఇచ్చింది. వాది దాఖలు చేసిన ఫిర్యాదులో ఉన్న మరో నలుగురు బాలికల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. పోర్న్ ఫిల్మ్ చూపించి మౌల్వీ తనపై అత్యాచారం చేశాడని ఐదుగురు బాలికలు ఆరోపించారు. మౌల్వీ ఇతర అమ్మాయిలతో కూడా ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని.. ఈ క్రమంలో ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.

Exit mobile version