ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదర్సాలో మతగురువు (మౌల్వీ) దారుణానికి ఒడి గట్టాడు. ఐదుగురు బాలికలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరక దోపిడీకి పాల్పడ్డాడు. మౌల్వీ చేసిన ఈ నీచమైన చర్యను ఐదుగురు బాలికలు బయటపెట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వారే కాకుండా.. ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇతర బాలికల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.