Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Maulana Salman Azhar Jaish Commander Killed Pakistan Suspicious Accident

Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!

Published Date :April 29, 2026 , 7:57 pm
By Shiva Ganesh
Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maulana Salman Azhar: పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ మౌలానా సల్మాన్ అజార్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ అగ్రశ్రేణి కమాండర్లలో ఒకడైన మౌలానా సల్మాన్ అజార్, బహవల్పూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

బహవల్పూర్‌లో అంత్యక్రియలు
తాజా నివేదికల ప్రకారం.. సల్మాన్ అజార్ అంత్యక్రియలు ఈరోజు (ఏప్రిల్ 29, 2026) సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న మర్కజ్ సుభానల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది జైష్ సానుభూతిపరులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదమా లేక ఎవరైనా పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా గతేడాది జూన్ మాసంలో కూడా జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన మరో కీలక వ్యూహకర్త మౌలానా అబ్దుల్ అజీజ్ ఈజర్ (అసర్) కూడా ఇటువంటి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించాడు. అజీజ్ ఈజర్ 2025 జూన్ 2న మరణించాడు. ఆయనది అధికారికంగా గుండెపోటు అని చెబుతున్నప్పటికీ, అతని మరణం వెనుక మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

Also Read

  • Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
  • Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..

2016లో జరిగిన నాగోటా ఉగ్రదాడితో సహా భారత్‌లో జరిగిన అనేక విధ్వంసకర దాడుల వెనుక ఈజర్ హస్తం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా విషపూరిత ప్రసంగాలు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. పాకిస్థాన్ ఆశ్రయంలో ఉంటూ భారత్‌పై దాడులకు తెగబడే ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది అబ్దుల్ అజీజ్, ఇప్పుడు సల్మాన్ అజార్ మరణించడంతో జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో లేదా అనుమానాస్పద ప్రమాదాల్లో ఉగ్రవాదులు హతమవుతుండటంతో పాకిస్థాన్ గడ్డపై వారికి రక్షణ కరువైందనే చర్చ నడుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anti-India Terrorists
  • Bahawalpur News
  • breaking news
  • India Security Updates 2026
  • jaish-e-mohammed

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions