ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినప్పటికీ.. తిరిగి మళ్లీ ప్రారంభంకావడంతో రద్దు అయింది. ఈ క్రమంలో.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
Read Also: Sushil modi: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కన్నుమూత
కాగా.. ఈ పాయింట్లతో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ కు చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ 13 మ్యాచ్ ల్లో 5 గెలువగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో 11 పాయింట్లు ఉన్నాయి. కోల్కతా 13 మ్యాచ్ ల్లో 9 గెలువగా ఈ మ్యాచ్ ఆగిపోయింది. దీంతో 19 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ప్లేఆఫ్ కు క్వాలిఫై అయింది. కాగా.. గుజరాత్ తర్వాతి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండనుంది. ఆ మ్యాచ్ లో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి. దీంతో.. గుజరాత్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన 3వ జట్టుగా నిలిచింది. కాగా.. రేపటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.