Site icon NTV Telugu

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కారు అదుపు తప్పి లారీని ఢీ.. నలుగురు మృతి..

Krishna Dist

Krishna Dist

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే, సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సీఐ అల్లు లక్ష్మీ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే, కొవ్వూరు నుంచి తమిళనాడు కారులో వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అని పోలీసులు తెలిపారు.

Read Also: Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్‌!

ఇక, మృతులు అందరు తమిళనాడుకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, వీరందరు ఒకే కుటుంబానికి చెందిన స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన సత్య అనే మహిళను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్సు లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదం లో నుజ్జునుజ్జైన కారును హైవే పెట్రోలింగ్ సిబ్బంది పక్కకు తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version