Stock Market: ఎంత మోసం.. దలాల్ స్ట్రీట్ లొసుగులను వాడుకొని కోట్లు కొల్లగొట్టిన అమెరికా సంస్థ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: 21 రోజులు.. నాలుగున్నర వేల కోట్లు.. ఇదీ అమెరికా ట్రేడింగ్ సంస్థ సంపాదించిన సొమ్ము. అవును నిజమే.. మీరు చదివిన సంఖ్యలు నిజమే.. అది కూడా మన స్టాక్ మార్కెట్‌లో. దలాల్ స్ట్రీట్‌లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. బిగ్ ఫ్రాడ్‌కు పాల్పడింది అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ. దీన్ని గుర్తించిన సెబీ వెంటనే చర్యలు తీసుకుంది.
జేన్ స్ట్రీట్‌కు చెందిన నాలుగు అనుబంధ సంస్థలను భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా చర్యలు తీసుకుంది. అంతేకాదు.. ఆ సంస్థ సంపాదించిన లాభం మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్స్ లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది సెబీ. దీనిపై జేన్ స్ట్రీట్ స్పందించింది. సెబీ బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందాయని.. తాము సంప్రదింపులు జరుపుతునట్లు వివరించింది.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
Read Also:IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!
జేన్ స్ట్రీట్ సంస్థ 45 దేశాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. 3 వేల మందికి పైగా సిబ్బందితో గ్లోబల్ ట్రేడింగ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లోని లొసుగులను గుర్తించి..అక్రమ పద్దతుల్లో ట్రేడింగ్ చేసింది. ట్రేడింగ్ పొజిషన్ల సూచీల దిశ, గమనాన్ని మార్చి వేల కోట్లు ఆర్జించినట్లు తేల్చింది సెబీ. ఇందుకోసం ఆ సంస్థ రెండు వ్యూహాలు పన్నినట్లు గుర్తించింది.
మార్నింగ్ పంప్, ఆఫ్టర్ నూన్ డంప్. అంటే.. ఉదయం ప్రముఖ సంస్థల స్టాక్స్, ఫ్యూచర్స్‌ను భారీగా కొనుగోలు చేస్తుంది. అదే రోజు ఉదయం బ్యాంక్ నిఫ్టీ సూచీని ఆప్షన్స్ మార్కెట్లో సెల్ చేస్తుంది. మధ్యాహ్నం బ్యాంక్ నిఫ్టీలోని కంపెనీల స్టాక్, ఫ్యూచర్స్ ను దూకుడుగా అమ్మేస్తుంది. క్యాష్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్ల అమ్మకాలతో ఆప్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీ షార్ట్ పొజిషన్ల విలువ భారీగా పెరుగుతుంది. తేలిగ్గా ఆ పొజిషన్ల నుంచి లాభాల్లో బయటకు వచ్చేస్తుంది.
ప్లాన్-2 లో ఆప్షన్స్ ఎక్స్‌పైరీ రోజుల్లో మానిప్యులేషన్. ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల చివరి రోజున మార్కెట్ ముగిసే సమయంలో భారీ ట్రేడ్‌లు చేసి సూచీలను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. దీనివల్ల వారి ఆప్షన్స్ పొజిషన్స్ నుంచి భారీ లాభాలు పొందేవారు. అది ఎలా అంటే.. జేన్ స్ట్రీట్‌కు సంబంధించిన మరో నాలుగు సంస్థలు ఉన్నాయి. ఒక సంస్థ క్యాష్, ఫ్యూచర్ మార్కెట్లలో ఆర్డర్లు పెట్టడం, లావాదేవీలు చేయడం చేస్తుంటే.. అదే సమయంలో మరో సంస్థ ఆప్షన్స్ మార్కెట్లో దానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఇక చివరి రెండు గంటల్లో నిఫ్టీ సూచీలో కీలకమైన షేర్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో నిఫ్టీ సూచీ ఆప్షన్స్‌లో లాంగ్ పొజిషన్ తీసుకొంటుంది. నిఫ్టీలోని షేర్ల విలువ పెరగడంతో.. సూచీ ఆప్షన్స్ భారీగా పెరిగి లాభాలు వస్తాయి. ఇలా చేసి జేన్ స్ట్రీట్ కేవలం 21 రోజుల్లోనే 4వేల 843 కోట్లు లాభం ఆర్జించినట్లు గుర్తించింది సెబీ.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!