Site icon NTV Telugu

Huge Explosion: మహారాష్ట్రలో ఘోరం.. కెమికల్ ప్లాంట్లో పేలిన బాయిలర్

Blast

Blast

Huge Explosion: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్లో బాయిలర్ బాంబులా పేలింది. ఈ ఘటనతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు. ముండేగావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పోలిథిన్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. కెమికల్ ప్లాంట్ బాయిలర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి.

Read Also: Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి

పలువురు ఫ్యాక్టరీలో చిక్కుకుపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్చలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వారి వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారత వాయుసేన హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని, వర్కర్లు, సూపర్‌వైజర్ సహా 19 మంది గాయపడ్డారని నాసిక్ ఎస్‌పీ షాహ్జి ఉమాప్ తెలిపారు. నాసిక్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని, గాయపడిన వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రమాదానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది.

Exit mobile version