Site icon NTV Telugu

Chennai: గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పలు రైళ్లు నిలిపివేత..!

Chennai Fire

Chennai Fire

Chennai: చెన్నై తిరువళ్లూరు సమీపంలో ఇంధనంతో వెళ్తున్న సరుకు రవాణా ( గూడ్స్) రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టు నుండి చమురుతో వెళ్తున్న సరుకు రవాణా రైలులో అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయని సమాచారం. ఎగసిపడుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పబడి ఉంది. రైలులో ఇంధనం ఉన్నందున మంటలు మరింత వ్యాపిస్తాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు.

Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో టాలీవుడ్

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, వెంటనే భారీ ఎత్తున చేరుకొని మంటలను ఆర్పడానికి చాలా కష్టపడుతోంది. మంటలను ఆర్పడానికి 10కి పైగా అగ్నిమాపక యంత్రాలతో మోహరించారు. మంటల కారణంగా అరక్కోణం మీదుగా వచ్చిన సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అలాగే, ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు.

Read Also:Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

దీని ప్రకారం చెన్నై సెంట్రల్ నుండి కర్ణాటక, వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. దీనితో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురివుతున్నారు. తెల్లవారుజామున రైలులో జరిగిన అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version