NTV Telugu Site icon

Hyderabad: బహదూర్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం..

Fire

Fire

రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బహుదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పుర x రోడ్డులోని లారీ మెకానికల్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానికల్ వర్క్ షాపులో ఒక అగ్ని ప్రమాదం జరుగుతున్న తీరు మారడం లేదు. పక్కనే ఉన్న 3వ అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఇంకా చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

READ MORE: Intermediate Paper Leak : ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్