Site icon NTV Telugu

Bomb Attack: పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 17 మంది మృతి

Bomb Blast

Bomb Blast

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండు పేలుళ్ల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీసులు ఉన్నారు. ఈ పేలుడులో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పాక్ లోని స్వాత్ లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ( సీడీటీ ) పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం జరిగిన పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్

పోలీస్ స్టేషన్ లోపల జరిగిన రెండు పేలుళ్లు భవనాన్ని ధ్వంసం చేశాయని పోలీసులు తెలిపారు. స్వాత్ ప్రావిన్స్ అంతటా భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి కాదని.. మందుగుండు సామగ్రి, మోర్టార్ షెల్స్ నిల్వ ఉన్న ప్రదేశంలో పేలుడు సంభవించిందని సీటీడీ డీఐజీ పేర్కొన్నారు.

Also Read : Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?

అయితే ఈ పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామనీ, బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ లు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. కూలిన భవనం పాతదేనని.. చాలా కార్యాలయాలు, సిబ్బంది భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ వెల్లడించారు. భవనం కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని.. దీని పరిధి ఇంకా తెలియరాలేదని అన్నారు. దీంతో స్వాత్ లోని ఆస్పత్రుల్లో ప్రావిన్షియల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ విధించింది. ఆత్మాహుతి దాడి జరిగిందని జిల్లా పోలీస్ అధికారి షఫీ ఉల్లా గండాపూర్ ( డీపీవో ) తెలిపారు. ఈ దాడిపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఈ పేలుడును ఖండించాడు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Exit mobile version