Site icon NTV Telugu

Chhattisgarh Encounter: కంకేర్‌లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోలు హతం..!

Encounter

Encounter

ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. 10 మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Nani 33: నాని సినిమాలో నటించాలని ఉందా.. మీకే ఈ బంపరాఫర్!

ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ల సంఖ్యను నిర్ధారించలేదు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ ఇంద్రకళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. కాగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Mumbai: సల్మాన్‌ఖాన్ ఇంటికి సీఎం ఏక్‌నాథ్ షిండే.. కుటుంబ సభ్యులకు పరామర్శ

Exit mobile version