ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.