NTV Telugu Site icon

Mumbai: ముంబైలో గాలి దుమారం.. ఈ సీజన్లో ఇదే మొదటి వర్షం

Mumbai

Mumbai

ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్‌లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

Read Also: Rahul Gandhi: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ..?

ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు వీస్తూ వర్షం పడింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ మరియు టేకాఫ్ కార్యకలాపాలు తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేయబడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. రానున్న 3-4 గంటల్లో పాల్ఘర్‌, థానే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్‌.. ఈసీ ప్రత్యేక దృష్టి..

ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నవీ ముంబైలోని అరోలి సెక్టార్ 5 ప్రాంతంలో రద్దీగా ఉండే రహదారిపై ఓ భారీ వృక్షం పడిపోయింది. ఈ సమయంలో ఎవరూ ప్రయాణించికపోవడంతో ముప్పు తప్పింది. కాగా.. నగరంలో భారీ గాలులు వీస్తుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.