Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?
- కుటుంబం పెళ్లికి హాజరయ్యేందుకు రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకుంది
- Full Tariff Rate (FTR) స్కీమ్ ద్వారా చేస్తారు
- పెళ్లిళ్లు, ఫ్యామిలీ టూర్లు, గ్రూప్ ట్రావెల్, స్కూల్/కాలేజ్ యాత్రలు వంటి సందర్భాల్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నూతన వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. ఆతర్వాత భరత్ లో అంతా ఒక్కచోట చేరి డ్యాన్సులతో పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా పెద్ద కలిసి ఆనందంగా పాల్గొంటారు. ఇలాగే జరిగిన ఓ ప్రత్యేకమైన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఆ కుటుంబం పెళ్లికి హాజరయ్యేందుకు రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకుంది. ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో బంధువుల ఆనందం, పిల్లల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
కుటుంబం రైలు ఎక్కిన వెంటనే వాతావరణం పండుగలా మారిపోవడం వీడియోలో కనిపిస్తుంది. పిల్లలు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపిస్తారు. ఎక్కడ చూసినా నృత్యం, వినోదంతో ఆ కోచ్ మొత్తం ఒక పార్టీలా తయారైంది. ప్రారంభంలో ఒకరు రైలు కోచ్‌ను పూల దండలతో అలంకరించి, అతిథులకు స్వాగతం పలుకుతూ పోస్టర్లను అతికిస్తారు. ఆ తర్వాత, నృత్యం మొదలవడంతో వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారుతుంది. కాబోయే వధువు కేక్ కట్ చేస్తుండగా, కుటుంబమంతా ఆమెను ఉత్సాహపరుస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది.
కోచ్ లోపల దుప్పట్లు, గిఫ్ట్ బాక్సులను కూడా ఉంచి ఉండటం పెళ్లి సన్నాహాలను సూచిస్తుంది. ఇంతలో, టికెట్ కలెక్టర్ తన పని తాను చేసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను కూడా ఆ వేడుకలో భాగమవుతాడు. ఈ వీడియోను @Ananth_IRAS అనే ట్విట్టర్ ఖాతా ‘POV: ఎ మార్వారీ వెడ్డింగ్’ అనే శీర్షికతో పంచుకున్నారు.
ఇలా బుక్ చేసుకునే వీలుందా?
అవును, భారతీయ రైల్వేలో ఒక రైలు కోచ్ మొత్తాన్ని (బోగీ పూర్తిగా) బుక్ చేసుకోవచ్చు. దీనిని Full Tariff Rate (FTR) స్కీమ్ ద్వారా చేస్తారు. ఇది పెళ్లిళ్లు, ఫ్యామిలీ టూర్లు, గ్రూప్ ట్రావెల్, స్కూల్/కాలేజ్ యాత్రలు వంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
ఎలా బుక్ చేయాలి?
ఇది IRCTC సాధారణ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కాదు. ప్రత్యేక FTR పోర్టల్ ఉపయోగించాలి.
ఆన్‌లైన్ బుకింగ్:వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.ftr.irctc.co.in
కొత్త యూజరైతే రిజిస్టర్ చేసుకోండి (ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో).
లాగిన్ అయి, Coach Booking ఎంచుకోండి.
మీ ప్రయాణ వివరాలు ఇవ్వండి (నుంచి స్టేషన్, గమ్యం, తేదీ, ట్రైన్ నంబర్/టైప్, కోచ్ రకం – స్లీపర్, 3AC, 2AC మొదలైనవి).
ప్యాసింజర్ల లిస్ట్ అప్‌లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ అమౌంట్ చెల్లించండి → FTR నంబర్ వస్తుంది.
ఆఫ్‌లైన్ బుకింగ్:
ప్రయాణం మొదలయ్యే స్టేషన్‌లో Chief Booking Supervisor (CBS) లేదా Station Manager వద్ద వ్రాతపూర్వక అప్లికేషన్ ఇవ్వండి.
అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసి, డిపాజిట్ చెల్లించాలి.
నియమాలు & ఛార్జీలు
బుకింగ్ సమయం: గరిష్టం 6 నెలల ముందు, కనీసం 30 రోజుల ముందు అప్లై చేయాలి.
రిజిస్ట్రేషన్ డిపాజిట్:ఒక్క కోచ్‌కి సాధారణంగా రూ.50,000 (7 రోజులలోపు ప్రయాణం కోసం).
7 రోజులు మించితే అదనపు ఛార్జీలు వస్తాయి.
ఇది రీఫండబుల్ (కొన్ని షరతులతో).
Also Read:9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..
ఒక ట్రైన్‌లో ఎన్ని కోచ్‌లు?
సాధారణంగా గరిష్టం 2 కోచ్‌లు (కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా సాధ్యం, కానీ టెక్నికల్ ఫీజిబిలిటీ బట్టి).
పూర్తి రైలు (ట్రైన్ చార్టర్): 18 నుంచి 24 కోచ్‌ల వరకు (2 SLR కోచ్‌లు తప్పనిసరి).
ఖర్చు: సాధారణ టికెట్ల కంటే 30-35% ఎక్కువ ఉండవచ్చు. అదనంగా ఖాళీ రన్ ఛార్జీలు, మెయింటెనెన్స్, సేఫ్టీ ఛార్జీలు వస్తాయి.
కోచ్ అటాచ్ చేయడానికి ట్రైన్ స్టాపేజ్ కనీసం 10 నిమిషాలు ఉండాలి.
When a Marwari wedding party books a railway coach! #IndianRailways #marriage pic.twitter.com/Yf52D2cISk
— Ananth Rupanagudi (@Ananth_IRAS) April 4, 2026
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..