Maruti Suzuki Victoris: మారుతి కంపెనీ భారత మార్కెట్లో తన కొత్త SUV మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris)ను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ వాహనాన్ని “Got It All” ట్యాగ్‌లైన్‌తో ముందుకు తీసుకొచ్చింది. ఫీచర్లు, సేఫ్టీ, డిజైన్ అన్నింటిలోనూ పూర్తి స్థాయి SUV అనిపించేలా తయారైంది ఈ కారు. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించి, ధరలను ప్రకటించనుంది.
మారుతి సుజుకి పై ఎప్పుడూ ఉన్న భద్రతా సందేహాలకు సమాధానం ఇస్తూ.. విక్టోరిస్ 5-స్టార్ BNCAP క్రాష్ టెస్ట్ రేటింగ్ ను సాధించింది. ఇక ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ తో పాటు, తొలిసారిగా భారత మార్కెట్లో లెవల్-2 ADAS టెక్నాలజీను అందించింది. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్టు, హై బీమ్ అసిస్టు, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఫీచర్ తో మరింత సురక్షితం చేసింది.
Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
విక్టోరిస్ డిజైన్ సింపుల్ అయినా స్టైలిష్‌గా ఉంది. ముందు భాగంలో e-Vitara ఇన్‌స్పైర్డ్ ఫేస్, స్లెండర్ LED హెడ్‌లాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 17 అంగుళాల ఎయిరో కట్ అల్లాయ్ వీల్స్ టర్బైన్ డిజైన్‌తో అందంగా ఉంటాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌లాంప్స్ ప్రత్యేకమైన లైట్ ప్యాటర్న్ తో ఆకట్టుకుంటాయి. ఇక కారు రంగులలో కూడా వైవిధ్యం చూపిస్తూ, మిస్టిక్ గ్రీన్, ఎటర్నల్ బ్లూ లాంటి కొత్త కలర్స్‌తో కలిపి మొత్తం 10 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక కారు క్యాబిన్ లో డ్యూయల్ టోన్ బ్లాక్-ఐవరీ డాష్‌బోర్డ్, సాఫ్ట్-టచ్ ప్యానెల్స్, పియానో బ్లాక్ ఫినిష్ తో ప్రీమియమ్ టచ్ అందించబడింది. సీటింగ్ కంఫర్ట్ తో పాటు, ప్రాక్టికల్ బూట్ స్పేస్ ఇవ్వబడింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 10.1 అంగుళాల Smartplay Pro-X ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 8-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ (Dolby Atmos 5.1 సపోర్ట్ తో), 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. 64 కలర్ ఆంబియంట్ లైటింగ్, జెస్చర్ కంట్రోల్ పవర్డ్ టెయిల్‌గేట్, వెంట్ సీట్స్, 360 కెమెరా, TPMS, వైర్లెస్ చార్జర్, 8-వే పవర్ డ్రైవర్ సీటు వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
IP66+68+69 రేటింగ్స్‌తో అల్టిమేట్ ప్రొటెక్షన్, నెక్స్ట్-జెన్ ఫ్లాగ్‌షిప్ తో రాబోతున్న Oppo Find X9!
విక్టోరిస్ ఇంజిన్ ఆప్షన్లు గ్రాండ్ విటారా నుంచి తీసుకోబడ్డాయి. ఇందులో భాగంగా 1.5L NA పెట్రోల్ ఇంజిన్ కారులో 103 hp పవర్, 139 Nm టార్క్, 5MT/6AT గేర్‌బాక్స్ ఆప్షన్లు. ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG కూడా లభ్యం అవుతాయి. అలాగే 1.5L స్ట్రాంగ్ హైబ్రిడ్ లో 92.5 hp పవర్, 122 Nm టార్క్, e-CVT గేర్‌బాక్స్ తో లభ్యం కానున్నాయి.
ఇక ఈ మారుతి సుజుకి విక్టోరిస్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది తన క్లాస్‌లో చాలా మంచి మైలేజ్ ఇస్తోంది. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 21.18 కి.మీ. మైలేజ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 21.06 కి.మీ. మైలేజ్ అందిస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్‌లో ఇది కొంచెం తక్కువగా, సుమారు 19.07 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG ఆప్షన్ అయితే ఏకంగా 27.02 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ అత్యధికంగా 28.65 కి.మీ. మైలేజ్ ను అందించి, ఫ్యూయల్ ఎఫిషెన్సీ పరంగా విక్టోరిస్‌కి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.