Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది. మే నెలలో మొత్తం 1,44,002 కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. తె
Read more : Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇప్పటికే తక్కువ ధరలకు కార్లు విక్రయిస్తున్న సంస్థగా మారుతీకి పేరుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ కార్లను కొంటుంటారు. కాగా.. మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్ వేరియంట్ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి. కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని మాత్రం మారుతీ వెల్లడించలేదు. అయితే ఏజీఎస్ వేరియంట్లను మరింత అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ 2014లో మొదటిసారి పరిచయం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ప్రయోజనాలను అందిస్తుంది. అవసరాన్ని బట్టి దానికదే గేర్ మారిపోతుంటుంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణాల్లో ఏజీఎస్ ఉంటే డ్రైవింగ్ మరింత సులభమవుతుంది. అంతేకాదు ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రకటనతో విక్రయదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!