NTV Telugu Site icon

Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ

Maruti Suzuki

Maruti Suzuki

నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది. మే నెలలో మొత్తం 1,44,002 కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కార్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది. ఆటో గేర్‌ షిఫ్ట్‌ (AGS) వాహనాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. ఈరోజు నుంచే ధర తగ్గింపు అమల్లోకి వచ్చిందని కంపెనీ తన ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. తె

Read more : Chandini Chowdary: ఏంటి చాందిని అలా కుదిరిందా.. లేదా సెట్ చేసుకున్నావా.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్..

ఇప్పటికే తక్కువ ధరలకు కార్లు విక్రయిస్తున్న సంస్థగా మారుతీకి పేరుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలు ఈ కార్లను కొంటుంటారు. కాగా.. మారుతీ తగ్గింపు ప్రకటించిన ఏజీఎస్‌ వేరియంట్‌ వాహనాల్లో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ ఉన్నాయి. ఈ మోడళ్లు రూ.5 వేల తగ్గింపు ధరతో లభించనున్నాయి. కార్ల ధరల్ని తగ్గిస్తున్న కారణాన్ని మాత్రం మారుతీ వెల్లడించలేదు. అయితే ఏజీఎస్‌ వేరియంట్లను మరింత అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆటో గేర్ షిఫ్ట్ అనేది మారుతీ సుజుకీ 2014లో మొదటిసారి పరిచయం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ. ఇది మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అవసరాన్ని బట్టి దానికదే గేర్‌ మారిపోతుంటుంది. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణాల్లో ఏజీఎస్‌ ఉంటే డ్రైవింగ్‌ మరింత సులభమవుతుంది. అంతేకాదు ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రకటనతో విక్రయదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.