Maruthi: ఈ మధ్య కాలంలో త్రిబాణదారి బార్బరిక్ అనే సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పి, ఆ సినిమా దర్శకుడు చెప్పుతో కొట్టుకుని సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అతను మాట్లాడుతూ, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్నాడు. ప్రేక్షకులు పెద్దగా సినిమా మీద ఆసక్తి కనబరచకపోవడంతో, నిజంగానే చెప్పుతో కొట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాని ప్రజెంట్ చేసింది దర్శకుడు మారుతి. మారుతి టీం ప్రోడక్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి, మారుతి టీం ప్రోడక్ట్ అంటూ వస్తున్న మరో సినిమా బ్యూటీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మారుతి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
READ ALSO: Asaduddin Owaisi: భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
త్రిబాణదారి బార్బరిక్ మంచి సినిమానే కానీ, టైటిల్ అందరికీ కనెక్ట్ కాలేదు. నేను టైటిల్ మార్చమని చెప్పాను, డైరెక్టర్‌కి 100 టైటిల్స్ సజెస్ట్ చేశాను, కొన్ని టైటిల్స్ డిజైన్ చేసి మరీ పంపించాను. కానీ, అతను నా మాట వినలేదు. మరీ అంత ఫోర్స్ చేయకూడదని నేను కూడా వదిలేశాను. సినిమా పోయిన తర్వాత చెప్పుతో కొట్టుకున్నాడు. సినిమా డైరెక్టర్ అనేవాడు ఒక క్రియేటర్, అలాంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎలా? ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసేసి తిరుగుతానంటున్నారు, సినిమాలో మానేస్తానంటున్నారు. ఒక్క సినిమా ఆడకపోతే అందరూ ఇంత దిగజారిపోతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా? ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆడుతుంది. అసలు ఇలాంటివన్నీ చేయడం ఏంటి? ఈ కల్చర్ ఎటు వెళుతుంది? కాంట్రవర్సీలు మాట్లాడితే, బూతులు మాట్లాడితే సినిమాలు ఆడతాయని అనుకుంటున్నారా? ఎలా అయినా జనాన్ని థియేటర్లకు రప్పించాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కుదరదు. సినిమాని నమ్మండి, ఎందుకంటే జనాలు మంచి సినిమా తీస్తే వస్తారు, అంటూ త్రిబాణదారి బార్బరిక్ దర్శకుడికి డైరెక్ట్‌గా కౌంటర్లు వేస్తూ వచ్చాడు మారుతి.
READ ALSO: Nithiin: మరో నితిన్ సినిమా ఆగింది!
