నేను ప్రభుత్వంలో బాధితుడిని అని అనలేదు అని ఎస్సీ కమీషన్ చైర్మన్ మరుముడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. సంవత్సరాలుగా మేము ఎస్సీలుగా బాధితులం అని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద బురద చల్ల దలుచుకుంటే మరోలా చల్లుకోండి.. రాజకీయాలు వేరేలా చేసుకోండి.. నేను నా పనులు చేసుకుంటా… మీడియా కు దూరంగా ఉంటా.. సీఎం జగన్ కు నన్ను దూరం చేయాలని ఇలా రాశారు.. సీఎం జగన్ నాకు చాలా గౌరవం ఇస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం కార్యక్రమాలకు నా పేరు ౩వ స్ధానంలో ఉంటుంది.. నేను ఊపిరున్నంత కాలం ఇలాంటి పదవిలో ఉంటాను అని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పేర్కొన్నారు.
Read Also: Virat Kohli Century: కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ఏమన్నారంటే..?
బౌద్ధ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాడిని అని ఎస్సీ కమీషన్ చైర్మన్ మరుముడి విక్టర్ ప్రసాద్ పేర్కొ్న్నారు. నన్ను వేరే పార్టీలోకి లాగాలనుకుంటున్నారేమో.. నేను మారను.. నారా లోకేష్ కు ఇందులో ఏంటి అంత ఇంటరెస్టు.. నారా లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడాలి అని ఆయన తెలిపారు. అమరావతిలో మా వాళ్ళ స్ధలాలు వందల ఎకరాలు నారా లోకేష్ కొట్టేసాడు.. పార్టీలకు అతీతంగా ఎస్సీలకు సహకరిస్తున్నాను.. మరోసారి ఇలాంటివి వస్తే నేను వీధుల్లోకి వస్తా అని హెచ్చరించారు. సీఎం జగన్ కు విన్నవించుకుంటే మన సమస్యలు తీరతాయన్నారు.. నన్ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలని చూస్తున్నారు.. ప్రతీ పార్టీలో అంతర్గత వైరుధ్యాలుంటాయని ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మరుముడి విక్టర్ ప్రసాద్ వెల్లడించారు.