బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ మూవీ మండేలాకు రీమేక్ గా తెలుగు లో ‘మార్టిన్ లూథర్ కింగ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి మాటలు అందించారు..మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్ మరియు వెంకటేశ్ మహా కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను శశికాంత్ మరియు చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మించారు. స్మరణ్ సాయి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.ఈ సినిమాకు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా కానీ విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి..మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం లో కూడా స్ట్రీమ్ అవుతోంది.
నవంబర్ 29న మార్టిన్ లూథర్ కింగ్ ను తీసుకురానున్నట్టు సోనీ లివ్ గతంలో ప్రకటించగా.. ఒక్కరోజు ముందే నేడు అందుబాటులోకి వచ్చేసింది.మార్టిన్ లూథర్ కింగ్ సినిమా.. ఓటు విలువను తెలిజెప్పేలా ఉంది. ఓటు ఎంత శక్తిమంతమైనదో తెలియజేస్తుంది.. పొలిటికల్ సెటైర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది.కామెడీతో సాగుతూనే ఎమోషనల్‍గా, ఆలోచింపజేసే విధంగా ఈ మూవీ ఉంది. ఓటు కోసం ఇద్దరు రాజకీయ నాయకులు.. మార్టిన్ లూథర్ కింగ్ (సంపూర్ణేశ్ బాబు)ను ప్రలోభాలకు గురి చేస్తారు. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న అతడి చుట్టూనే తిరుగుతారు. దీంతో మార్టిన్ లూథర్ కింగ్ జీవితం ఎలా మలుపు తిరిగింది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ కథ.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో రెండు రోజుల్లో (నవంబర్ 30న) ఉండగా.. సందర్భానికి అనుగుణంగా ఓటు విలువను తెలియజేప్పే మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది.