Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Martin Luther King %e0%b0%93%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80 %e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf %e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8 %e0%b0%b8

Martin Luther King : ఓటీటీ లోకి రాబోతున్న సంపూర్ణేష్ నటించిన మార్టిన్ లూథర్ కింగ్..?

Published Date :November 13, 2023 , 12:25 pm
By Murali Krishna
Martin Luther King : ఓటీటీ లోకి రాబోతున్న సంపూర్ణేష్ నటించిన మార్టిన్ లూథర్ కింగ్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హృదయం కాలేయం, కొబ్బరి మట్ట అనే కామెడీ సినిమాల తో అద్భుత విజయం అందుకొని కామెడీ పాత్రలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయింది.. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.మార్టిన్ లూథర్‌కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు సీనియర్ నరేష్‌ మరియు డైరెక్టర్ వెంకటేష్ మహా ముఖ్య పాత్రలు పోషించారు.వెంకటేష్ మహా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించాడు. మార్టిన్ లూథర్ కింగ్‌ సినిమా కు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు.తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ రూపొందింది.మండేలా మూవీ లో తమిళ్ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించారు. యోగి బాబు పాత్రను తెలుగులో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా లో సంపూర్ణేష్ బాబు నటించాడు.

ఇదిలా ఉంటే థియేటర్స్ లో అలరించిన మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీలోకి రాబోతోంది.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో రిలీజ్ కానుంది. నవంబర్ 17 లేదా 24లలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రెండింటిలో ఫైనల్ డేట్ ఏదన్నది త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లు తెలిసింది.మార్టిన్ లూథర్ కింగ్ కథ విషయానికి వస్తే..పడమరపాడు అనే ఊరికి చెందిన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంటాడు. ఊరిలో జరిగిన ఎన్నికల్లో స్మైల్ ఓటు కీలకంగా మారుతుంది. అతడు ఓటు వేసిన వారే గెలిచే అవకాశం ఉండటంతో స్మైల్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది. అతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని ఎవరు పేరు పెట్టారు. లోకి (వెంకటేష్ మహా), జగ్గు(నరేష్‌)లలో తన ఓటును స్మైల్ ఎవరికి వేశాడు అన్నదే ఈ సినిమా కథ.థియేటర్ లో విడుదల అయి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా. ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #martin luther king
  • OTT
  • Sampoornesh Babu

తాజావార్తలు

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions