Site icon NTV Telugu

Married Couple Protest : పోలీస్ స్టేషన్ ముందు పెళ్లి జంట నిరసన

Marriage Couple

Marriage Couple

మరికొన్ని నిమిషాల్లో పెళ్లి చేసుకోవాల్సిన కొత్త పెళ్లి జంట కాస్త పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ వివాహానికి ససేమిరా అన్నారు. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఊహిస్తున్నారు.. అందరూ.. అస్సలు కానే కాదు అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.. అయితే మధ్య ప్రదేశ్ లోని రత్లాం జిల్లాలో ఓ వివాహ వేడుక గ్రాండ్ గా మొదలైంది. అందరూ సందడి చేస్తున్నారు. ఓ వైపు పెద్ద డీజే మ్యూజిక్ అదిరిపోయింది. అప్పుడే పోలీసులు వచ్చారు.

Also Read : Amul vs Nandini: కర్ణాటకలో “పాల వివాదం”..నందిని మిల్క్‌కు సపోర్టుగా బెంగళూర్ హోటల్స్..

దీంతో వెంటనే డీజే ఆపమని చెప్పారు. పెళ్లివారు వినలేదేమో పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లింది. అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారిని.. పెళ్లి పందరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకునే వరకు తామ పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగింది. చివరికి పోలీసులు వారికి సర్ది చెప్పి హామీ ఇవ్వడంతో పెళ్లి జంట మ్యారేజ్ చేసుకోవాడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి పోలీసుల వల్ల ఆగిపోయిన పెళ్లి జరగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Ugram: హాట్ సమ్మర్ లో మంచి వెకేషనల్ సాంగ్… అల్బెలా

Exit mobile version