మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి అమిత్‌షాతో భేటీ అయ్యారు మర్రి శశిధర్ రెడ్డి. ఇదిలా ఉంటే.. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారు. తాను ఢిల్లీ వచ్చిన విమానంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారని చెప్పారు. మనవడి స్కూల్ ఫంక్షన్ కోసమే తాను ఢిల్లీ వచ్చానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
Also Read : MLA’s Poaching Case : సిట్ దూకుడు.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు
తాను తరుచుగా ఢిల్లీ వస్తుంటానని చెప్పారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్ కాలేదని గుర్తు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. కొంత కాలం క్రితం పీసీసీ చీఫ్ పై మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ రోజు అమిత్ షాతో భేటీ కావడంతో.. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఢిల్లీలోనే ఉన్న శశిధర్ రెడ్డి త్వరలో అధికారక ప్రకటన చేస్తారేమో చూడాలి.
