Site icon NTV Telugu

Stock Market: దళాల్ స్ట్రీట్‌లో బుల్ గర్జన.. స్టాక్ మార్కెట్‌లో లాభాల జాతర!

Indian Stock

Indian Stock

Stock Market: భారత స్టాక్ మార్కెట్ బుధవారం అద్భుతమైన ర్యాలీని చూసింది. మార్కెట్ క్లోజ్ కావడానికి కొన్ని గంటల ముందు సెన్సెక్స్, నిఫ్టీ బాగా పెరిగాయి. ఇది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలను పెంచింది. బిఎస్‌ఈ సెన్సెక్స్ 487.20 పాయింట్లు (0.60% పెరిగి) 82,344.68 వద్ద ముగిసింది, నిఫ్టీ 167.35 పాయింట్లు (0.66% పెరిగి) 25,342.75 వద్ద క్లోజ్ అయ్యింది. బిఎస్‌ఈలోని టాప్ 30 స్టాక్‌లలో ఎనిమిది మాత్రమే క్షీణించగా, మిగిలిన 22 బలమైన లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ రోజు బిఈఎల్ షేర్లు అత్యధికంగా 8.90 శాతం పెరిగి రూ.453కి చేరుకుంది. ఎటర్నల్ షేర్లు 5 శాతం పెరిగి రూ.266కి రీచ్ అయ్యింది. బజాజ్ ఫైనాన్స్, ఫిన్‌సర్వ్, ట్రెంట్, పవర్‌గ్రిడ్ అన్నీ 2 శాతం లాభపడ్డాయి. మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్ నష్టాలతో ముగిశాయి.

READ ALSO: AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 35 అజెండా అంశాలకు ఆమోదం..

పెట్టుబడిదారులు ఎంత లాభాలను ఆర్జించారంటే..
ఈ రోజు స్టాక్ మార్కెట్ మిడ్, స్మాల్ క్యాప్ రంగాలలో కూడా బలమైన ర్యాలీని చూసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100.. 954 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100.. 371 పాయింట్లు లాభపడింది. దీంతో పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు గణనీయంగా పెరిగాయి. బిఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.453.67 లక్షల కోట్ల నుంచి రూ.459.64 లక్షల కోట్లకు పెరిగింది, మొత్తంగా చూస్తే ఈ రోజు మార్కెట్ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగింది.

స్టాక్ మార్కెట్ లాభపడటానికి రీజన్స్ ఇవే..
బుధవారం భారత స్టాక్ మార్కెట్‌ పెరుగుదలకు అతిపెద్ద కారణం భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ – ఈయూ చాలా వస్తువులపై సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తి సుంకాల రహితంగా చేయడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతులను పెంచుతుందని, అనేక కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చింది. దీంతో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ బలమైన లాభాలను చవిచూశాయి. ముఖ్యంగా మార్కెట్ ముగియడానికి కొన్ని గంటల ముందు మార్కెట్ గణనీయమైన లాభాలను నమోదు చేసింది. ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో స్టార్‌లైట్ షేర్లు 20% పెరిగి రూ.103కి చేరుకుంది. తేజస్ నెట్‌వర్క్స్ షేర్లు 15% , డేటా ప్యాటర్న్స్ షేర్లు 13.63%, హిందూస్తాన్ కాపర్ షేర్లు 12.67%, ఆయిల్ ఇండియా షేర్లు 9%, మోతీలాల్ ఓస్వాల్ షేర్లు 8% మేర పెరిగాయి.

READ ALSO: Plane Crashes: విమాన ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయకులు వీరే!

Exit mobile version