NTV Telugu Site icon

KP Nagarjuna Reddy: పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Kp Nagarjuna Reddy

Kp Nagarjuna Reddy

KP Nagarjuna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురం మండలంలోని తూర్పుపల్లి సచివాలయం పరిధిలోని మాల పాటిపల్లి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

Read Also: Kishan Reddy: కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మాలపాటిపల్లి ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపలోని సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డిని ఘనంగా సత్కరించారు.

Show comments