Markapur Accident: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా 14కు చేరుకుంది. మరో 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలున్న వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, నరసరావుపేట, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు.
AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాలను మార్కాపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అధిక వేగమే కారణమా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మృతులకు ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా కూడా అందనుంది. మార్కాపురం ఘటనలో బస్సు ప్రమాద ఘటనలో 14కు చేరిన మృతులు..
మృతుల వివరాలు:
Rayavaram Bus Tragedy: రాయవరం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేబినెట్..
1. అంబటి అనిల్ 26 సం. పెద్దరికట్ల, కేకే మెట్ల మండలం..
2. అంబటి అనిల్ కుమారుడు ( 5 నెలల బాబు )
3. బండారు పద్మ (28) కనిగిరి
4. ముత్తంగి వెంకటేశ్వర్లు (40) – దాసరికల్లు గ్రామం,ఉదయగిరి మండలం..
5. తమ్మిశెట్టి పిచ్చమ్మ – చల్లసిరలగల గ్రామం, కనిగిరి.
6. తమ్మిశెట్టి రుక్మిణి – చల్లసిరలగల గ్రామం, కనిగిరి.
7. ఉప్పు రమాదేవి. – రంగారెడ్డి పల్లె గ్రామం, కనిగిరి.
8. మహేంద్ర – పొదిలి.
9. ప్రభావతి – పొదిలి.
10. కత్తి జయరాములు, – పొదిలి.
11. ఆత్మకున చిన్న (45) – కనిగిరి.
12. దేవేంద్ర రామయ్య. – కనిగిరి.
13. చైత్ర.
14. జ్యోతి.