Site icon NTV Telugu

Marijuana: గంజాయి.. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి..

Marijuna

Marijuna

హైదరాబాద్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాలు వరుసగా పట్టుబడుతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా నుండి హైదరాబాద్‌ మీదుగా నార్త్‌ ఇండియాకు కిలోల కొద్ది గంజాయి తరలివెళుతుంది… ఈ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, ఎస్‌ఓటీ, లోకల్‌ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐనా, నిఘా కళ్లుగప్పి గంజాయి రవాణా కొనసాగుతోంది. తాజాగా 4 కోట్ల రూపాయల విలువైన హైగ్రేడ్‌ గంజాయిని పట్టుకున్నారు.

Also Read:EPFO New Rule: యూఏఎన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ టెన్షనే ఉండదు!

ఇక గంజాయి డిమాండ్‌ పెరుగుతుండటంతో స్మగ్లర్లు కూడా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. వినియోగదారుల వద్దకు గంజాయి చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఐతే ఒడిశా నుంచి నార్త్ ఇండియాకు అక్రమంగా గంజాయి విపరీతంగా తరలిపోతోంది. ఐతే హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ దృష్టిసారించింది.

Also Read:Triple Murder: వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. మూడు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం..!

హైదరాబాద్, సైబరాబాద్‌
రాచకొండ కమిషనరేట్లలో ప్రత్యేక నిఘా

ప్రధానంగా నార్త్‌ ఇండియాకు గంజాయిని రవాణా చేయాలంటే, హైదరాబాద్‌ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గంజాయి కట్టడికి హైదరాబాద్, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌తో పాటు బైపాస్‌ ల పై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో కిలోల కొద్ది గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్నాయి పలు ముఠాలు.

Also Read:Triple Murder: వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. మూడు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం..!

తాజాగా ఈగల్‌ టీమ్‌కు చెందిన ఖమ్మం అధికారులకు ఒడిశా నుండి భారీ ఎత్తున గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈగల్‌ టీమ్‌తో కలిసి ఖమ్మంకు చెందిన ఆర్‌ఎన్‌సీసీ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. మినీ ట్రక్కులో భారీగా హైగ్రేడ్‌ గంజాయి రవాణా అవుతోందన్న సమాచారంతో వాహనాన్ని వెంబడించారు. శంషాబాద్‌ సమీపంలో వాహనాన్ని అడ్డగించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. వాహనంలో 847 కిలోల హైగ్రేడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Nimmala Ramanaidu: జగన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా..!

ఖిల్లా ధానా, రాజేందర్‌ అనే వ్యక్తులు కలిసి గంజాయి దందా

వాయిస్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖిల్లా ధానా, రాజేందర్‌ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి గంజాయిని తీసుకొని ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌‌కు చెందిన రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో 847 కిలోల గంజాయిని పలు ప్రాంతాల నుంచి రమేశ్‌ అనే వ్యక్తి సేకరించి ఖిల్లాధనా, రాజేందర్‌కు అప్పగించాడు. ఈ ఇద్దరు నిందితులు ఆ గంజాయిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాఫిక్‌కు అందజేయాల్సి ఉంది. ఇటీవలే షాఫిక్‌, రమేశ్‌కు భారీగా గంజాయి ఆర్డర్లను అందజేశాడు. ఇందులో భాగంగా గంజాయిని ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు ఖిల్లాధానా, రాజేందర్‌ భారీ కత్తిని తమ వద్ద ఉంచుకున్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. పోలీసులు ఆపడానికి యత్నించినా దాడి చేసేందుకు పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

Also Read:Triple Murder: వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. మూడు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం..!

నిందితులు ఖిల్లాధానా, రాజేందర్‌ను అరెస్టు చేసిన ఈగల్‌ టీమ్‌, ఆర్‌ఎన్‌సీసీ ఖమ్మం జిల్లాకు చెందిన టీమ్‌లు వారి నుంచి 4 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన 847 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గంజాయిని సేకరించి సరఫరా చేస్తున్న రమేశ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు పోలీసులు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Exit mobile version