Site icon NTV Telugu

Maoists Surrender : మావోయిస్టులకు మరో దెబ్బ.. కీలక నేత సహా 37మంది లొంగుబాటు..

Maoist Surrender

Maoist Surrender

Maoists Surrender : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వం నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి పెద్ద ఫలితాన్ని సాధించాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.

Pawan Kalyan: జనసేన కమిటీలపై పవన్ ఫోకస్.. కమిటీల నిర్మాణం, కూర్పుపై దిశా నిర్దేశం..

ఆజాద్‌తో పాటు లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తిని కూడా అప్పగించారు. పోలీసులు ఈ సందర్భంగా 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్, వాటికి సంబంధించిన బుల్లెట్లు, క్యాట్రెడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. శాంతియుత జీవనానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లొంగిపోయిన వారికి ప్రభుత్వం రూపొందించిన పునరావాస పథకాల ప్రకారం సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

Al-Falah University: హోదాను ఎందుకు రద్దు చేయకూడదు.. జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు

Exit mobile version