NTV Telugu Site icon

Breaking news: మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చిన మావోయిస్టులు

Ts

Ts

కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేశారు. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మరణశిక్ష మావోయిస్టు పార్టీ విధించింది. పోలీసులకు లొంగిపోయి పూర్తిగా రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు. రాధాపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం కమాండర్ బాధ్యత నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ, ఛత్తీస్గడ్ ఇంటలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధా ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించింది.. అంటూ లేఖలో పేర్కొంది.. మావోయిస్టు పార్టీ.

READ MORE: Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!

నిర్ణయం మేరుకే రాధాకు మరణశిక్ష విధించామని మావోయిస్టు పార్టీ తెలిపింది. గతంలో రాధాను శిల్పా, దేవేంద్ర అనే వ్యక్తులు మావోయిస్టు పార్టీ వైపు మళ్లించారు. శిల్పా కేసులో ఏపీ, తెలంగాణలో గతంలో ఎన్ఐఏ సోదాలు చేసి పలువురిని అరెస్టు చేసింది. “పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడదాం! పోలీసుల కోవర్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో(రాధ)ను చంపేసాం!” అని మావోయిస్టులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో రాసుకొచ్చారు.

READ MORE:TS High Court: జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ.. హైడ్రా విధివిధానాలు స్పష్టం