Site icon NTV Telugu

Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందుపాతరల కలకలం.. పోలీసులే టార్గెట్

New Project (4)

New Project (4)

Maoist: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోతున్నారు. చర్ల మండలంలోని బెస్త కొత్తూరు, అంజినాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికి తీశారు.

Read Also:AP High Court: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నియామకాల్లో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులు.. స్పందించిన హైకోర్టు

ఇది ఇలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లో ఓ టవర్ జనరేటర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. ఛత్తీస్‌గఢ్- దంతెవాడ నారాయణపూర్ జిల్లాల మార్గ మధ్యలోని హర్రా కొడేర్ గ్రామంలో మావోయిస్టులు జియో టవర్ జనరేటర్‌ను తగలబెట్టారు. ఇక ఘటనా స్థలంలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వదలి వెళ్లారు. డిసెంబర్ 2 నుండి 8 వరకు పి.ఎల్.జి.ఏ. వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించి విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Read Also:Kishan Reddy: బీఆర్ఎస్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కి కిషన్ రెడ్డి ఫిర్యాదు

అలాగే.. దుమ్ముగూడెం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్‌ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించారు.

Exit mobile version