NTV Telugu Site icon

Maoists Surrender: సీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

Maoists

Maoists

Maoists Surrender: కరీంనగర్ సీపీ, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమక్షంలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తిక్క సుష్మిత అలియాస్ చైతే ఏరియా కమిటీ మెంబర్‌గా, మడకం దూల ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేశారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్‌గా పనిచేశారని ఎస్పీ తెలిపారు.

హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత(27) తన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.

Read Also: Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్‌!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు

ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేశారు. వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని, ఆ మొత్తాన్నిఈరోజు సీపీ చేతుల మీదుగా బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పి.తిరుమల్, హసనపర్తి ఇన్‌స్పెక్టర్ జె.సురేష్ పాల్గొన్నారు.

Show comments