Site icon NTV Telugu

Tragedy: వర్షం నింపిన విషాదం.. పిడుగులు పడి పలువురు మృతి

Tragedy

Tragedy

తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. కుండపోత వర్షం పలు కుటుంబాల్లో విషాధాన్ని నింపింది. ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం (మం) చల్పాక గ్రామంలో లో పిడుగు పడి ఊకె కృష్ణ కృష్ణ అనే రైతు మృతి చెందాడు. చిట్టిబాబు అనే మరో రైతుకు గాయాలు అయ్యాయి. పంట పొలంలో పనులకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెందాడు. పొలం దగ్గర తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న సమయంలో పడ్డ పిడుగుతో మొద్దు రాకేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ళేదుంటే పిడుగు పాటుకి కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Also Read:Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ రగుడు వద్ద పిడుగుపాటుతో బోయిన్ పల్లి మండలం వరదవెల్లికి చెందిన మొగిలి ఎల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. సొంత గ్రామం ముంపునకు గురికాగా, తన మేకల మేత కోసం 20 రోజుల క్రితం రగుడు లోని బంధువు బాలయ్య ఇంటికి వచ్చాడు ఎల్లయ్య. ఈరోజు కూడా తన మేకలను మేతకు తీసుకెళ్ళాడు. ఒకేసారి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఎల్లవ్వ కొడుకులు రమేష్ నరేష్ ఉన్నారు.

సిద్దిపేట విద్యుత్ డివిజన్ కార్యాలయం సమీపంలో పిడుగు పడింది. సిద్దిపేటలో ఐదు ఫీడర్లలో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. కార్యాలయంలోని విద్యుత్ సామగ్రి కాలిపోయింది. నిర్మల్ జిల్లా మామడ మండలం కోర్టికల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పై పిడుగు పడింది. మందిరం పై పిడుగు పడడం తో గుడి గోపురం దెబ్బతిన్నది.

Also Read:EX-DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఇష్యూ పై స్పందించిన సీఎం రేవంత్.. ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం సిద్ధం

నిర్మల్ జిల్లా భైంసా మండలం బిజ్జూర్ వాగు వద్ద ఎడ్ల బండిలో వెళ్తున్న వృద్దు రాలు గల్లంతైంది. గ్రామానికి చెందిన సురేష్, గంటోల్ల లక్ష్మీబాయి అనే వృద్ధురాలితో ఎడ్ల బండి పై తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సురేష్ ప్రాణాల తో బయట పడగా వాగులోపడి లక్ష్మీబాయి గల్లంతయ్యింది. ఓ ఎద్దు గేదె మృతిచెందాయి. యాదాద్రి జిల్లా.. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండ గుట్టల్లో 3 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. కోళ్ల ఫామ్ లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో కోళ్లు చనిపోయాయి. భారీ నష్టం వాటిల్లిందని తనను ఆదుకోవాలని కోళ్ల ఫాం యజమాని ప్రభుత్వాన్ని కోరాడు.

Exit mobile version