Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌లోని సైనిక విమానాశ్రయం వెలుపల ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 14మంది చనిపోగా మరో ఎనిమిదిమందికి గాయాల పాలైనట్లు అధికార ప్రతినిధి అబ్ధుల్ నఫీ టాకోర్ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు జరుగుతుందని .. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పేలుళ్లకు గల కారణాలు, దాని లక్ష్యం గురించిన ప్రాథమిక సమాచారం ప్రస్తుతానికి టాకోర్ అందలేదని తెలిపారు. భారీ పటిష్టమైన భద్రత కలిగి ఉన్న విమానాశ్రయంలోని మిలిటరీ సైడ్ పరిసరాల్లో ఉదయం 8 గంటలకు భారీ పేలుడు వినిపించిందని స్థానికులు తెలిపారు.
Read Also: Strange Animal : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘వింత జంతువు’
ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అన్ని రహదారులు మూసివేశారు. డిసెంబర్ 12న, గుర్తుతెలియని ముష్కరులు కాబూల్‌లోని చైనీస్ వ్యాపారులకు చెందిన హోటల్‌పై దాడి చేశారు. తాలిబాన్ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను మూసివేయడానికి ముందు బహుళ అంతస్తుల కాబూల్ లాంగన్ హోటల్ నుండి పొగలు కనిపించాయి. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భద్రతను మెరుగుపరిచినట్లు పేర్కొంది.. అయినా అనేక బాంబు పేలుళ్లు, దాడులు జరిగాయి. కాబూల్ సహా ఆఫ్ఘానిస్ధాన్‌లో ఇటీవల ఐఎస్ స్ధానిక గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు, దాడులకు తెగబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.