NTV Telugu Site icon

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన క్రీడాకారులు

Many Sports Mens

Many Sports Mens

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 290 మంది చనిపోగా.. సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో ఘోర రైలు ప్రమాదంగా ఈ విషాదం మిగిలిపోనుంది. బెంగళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ – చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు శుక్రవారం సాయంత్రం ఢీకొన్నాయి. చాలా బోగీలు పట్టాలు తప్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మాజీ ప్లేయర్ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా సహా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు

విరాట్ కోహ్లీ: ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‍లో ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఈ రైలు ప్రమాదం గురించి ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన ఈ విషాదకర ట్రైన్ ప్రమాదం గురించి వినడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు.

Also Read : Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్

వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా స్పందించారు. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇన్‍వాల్వ్ అయిన విషాదకర రైలు ప్రమాదం తీవ్రమైన వేదన కలిగిస్తోందన్నాడు. తమ ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ సెహ్వాగ్ కోరాడు.

Also Read : Sonia Gandhi: ఒడిశా రైలు ప్రమాదం అత్యంత విషాదం.. మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం

సురేష్ రైనా: ఒడిషా రైలు విషాద ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రైనా ట్వీట్ చేశారు.

మయాంక్ అగర్వాల్: బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు చూశాక నా హృదయం బద్దలైంది అంటూ మయాంక్ అగర్వాల్ అన్నాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. అని మయాంక్ ట్వీట్ చేశాడు.

Also Read : Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

వీవీఎస్ లక్ష్మణ్: ఒడిశాలో రైలు ప్రమాదం దురదృష్టకర ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి నా మనసును తీవ్రంగా కలిచి వేసిందని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తా.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా.. అని క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.

యువరాజ్ సింగ్: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నా అని మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

సానియా మీర్జా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం చాలా విషాదకరమైనది.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మాజీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.