Manushi Chhillar : మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె మీద డేటింగ్ రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. మొన్న అనంత్ అంబానీ పెళ్లిలో వీర్ పహారియాతో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు చూసి డేటింగ్ లో ఉన్నారంటూ తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వాటిపై మానుషీ స్పందించింది. ఓ ఇంగ్లిష్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “నేను ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ లో లేను. నాకు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహితులుగా ఉన్నారు. నేను అమ్మాయిలతో ఉంటే నాకు అబ్బాయిలు అంటే ఇష్టం లేనట్టు కాదు. అలా అని అబ్బాయితో స్నేహం చేస్తే డేటింగ్ చేస్తున్నట్టు కాదు. నేను నాకు నచ్చినట్టు బతుకుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : Dil Raju: ఆ రెండు సినిమాల సీక్వెల్స్ మీద కూర్చున్న దిల్ రాజు
వీర్ పహారియాతో డేటింగ్ రూమర్లును తీవ్రంగా ఖండించింది. “వీర్ పాపం చాలా మంచి వ్యక్తి. ఆ పెళ్లిలోనే అతన్ని మొదటిసారి కలిశాను. ఆ పెళ్లిలో నాకు అతను కంపెనీ ఇచ్చాడు. దానికే మా ఇద్దరి నడుమ డేటింగ్ రూమర్లు అల్లేయడం కరెక్ట్ కాదు. నేను ప్రస్తుతం సినిమాల మీదనే ఫోకస్ పెట్టాను. నా నుంచి మంచి సినిమాలు వస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. అక్షయ్ కుమార్ తో పాటు చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నా్యి. త్వరలోనే ఓ ప్యాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్టు సమాచారం. మానుషీ త్వరలోనే తెలుగు సినిమాలో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Read Also : Parliamentary Panel: రోహింగ్యా, బంగ్లాదేశీలను భారత్ నుంచి పంపించాలి..