NTV Telugu Site icon

The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్‌ పూర్తి.. క్లారిటీ ఇచ్చిన మనోజ్

New Project 2024 12 30t133417.732

New Project 2024 12 30t133417.732

The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె దర్శకత్వం వహించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించారు. సీక్వెల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ 2021లో విడుదలై మంచి స్పందనను అందుకుంది. పార్ట్‌ 1, 2 లకు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల, మనోజ్ బాజ్‌పేయి తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా, చిత్ర బృందం అతన్ని అభినందించి సెట్‌లో జరుపుకుంది. అతనితో కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. షూటింగ్ పూర్తి చేశానని చెప్పాడు. ఈ సిరీస్ చూడటానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని చెప్పాడు.

Read Also:Anagani Satya Prasad: చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీట: మంత్రి అనగాని

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలైంది. రాజ్, డికెతో పాటు, సుమన్ కుమార్ దీనికి కథను అందించారు. ఇందులో, మధ్యతరగతి వ్యక్తి, సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ అధికారిగా మనోజ్ .. శ్రీకాంత్ తివారీ కనిపించారు. ప్రియమణి అతని భార్యగా నటించారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో సాగే మొదటి సీజన్ 2019లో విడుదలైంది. దీనికి కొనసాగింపుగా 2021లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలైంది. ఇందులో సమంత కీలక పాత్ర పోషించింది. శ్రీలంకలో తమిళ తిరుగుబాటుదారులు చేసిన కుట్ర నేపథ్యంలో దీనిని రూపొందించారు. ఇది ప్రేక్షకులను కూడా అలరించింది. మనోజ్‌ బాజ్‌పేయి తను సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో ఏం రాసుకొచ్చారంటే.. ‘సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్‌ షూటింగ్‌ ముగిసింది. త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్‌ మీ ముందుకు రాబోతున్నాడు’’ని ఆయన రాసుకొచ్చారు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో ప్రియమణి, షరీబ్‌ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్‌ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also:Zee : న్యూ ఇయర్ కానుకగా జీ తెలుగు డబుల్ బొనాంజా..

Show comments