మహమ్మారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున సినిమా షూటింగులకు బ్రేక్ పడడమే కాకుండా థియేటర్లు కూడా వరుసగా మూతపడ్డాయి.ఇలా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ఓటీటీ లు ముందుకు వచ్చాయి.ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ ల ను ప్రసారం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం థియేటర్లో ఓపెన్ అయినప్పటికీ ఓటీటీలకు కూడా మాత్రం భారీగానే డిమాండ్ ఉంది ఎన్నో సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో కూడా విడుదలవుతున్నాయి దీంతో ఓటీటీలకు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు . ఇక ఇందులో ప్రసారమయ్యే సినిమాలకు సెన్సార్ కట్ కూడా లేకపోవడం విశేషం.
ఇలా ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో ఎన్నో బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లు ఇందులో ప్రసారం అవుతున్నాయి.అయితే ఈ విధంగా బోల్ట్ కంటెంట్ ఉండటం వల్ల కుటుంబంతో కలిసి ఇలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీస్ లను చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు.అయితే ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు విడుదలవుతున్న సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఓటీటీలకు కూడా సెన్సార్ ఉంటే బాగుంటుందంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా తాజాగా ఓటీటీలకు సెన్సార్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఓటీటీలకు కనుక సెన్సార్ వస్తే తప్పకుండా అస్సలు ఓటీటీ లు బ్రతకవు అని ఈయన కామెంట్స్ చేశారు. ఓటీటీ అనేది స్వతంత్ర వ్యవస్థ అని ఎవరు ఏం చూడాలి అని మనం అస్సలు నిర్ణయించలేం. ఓటీటీలు వచ్చిన కొత్తల్లో డైరెక్టర్లు తాము ఏదైతే చూపించాలి అనుకున్నారో కచ్చితంగా అది ఉన్నది ఉన్నట్టుగా చూపించారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ అయితే పాటిస్తున్నారు. అందరు దర్శకులు ఇలా స్వీయ నియంత్రణలో ఉండి కంటెంట్ కనుక చూపిస్తే ఓటీటీలకు ఎలాంటి సెన్సార్ కూడా అవసరం ఉండదు అంటూ ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.