NTV Telugu Site icon

Manohar Rao: పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచలేదు: పీవీ సోదరుడు

Pv Narasimha Rao

Pv Narasimha Rao

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. స్మారక చిహ్నం నిర్మిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. కుటుంబీకులు అంగీకరించారు. కానీ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక స్మారకాన్ని నిర్మించలేదని గుర్తు చేశారు. భారతరత్న కూడా ఇవ్వలేదన్నారు. కనీసం పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచడానికి అనుమతించలేదని తెలిపారు.

READ MORE: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్‌‌వి చిల్లర రాజకీయాలు..

మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల మనోహర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ” ఆయన పదేళ్లపాటు ప్రధానిగా ఉన్నారు. అంతకు ముందు పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పట్లో పీవీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. ఆ కాలంలో మన్మోహన్‌ సింగ్‌ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్.. గురు-శిష్యుల వలె పనిచేశారు. అప్పటి రాజకీయాలకు ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం దేశ విదేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పాలసీ రాలేదు. మన్మోహన్ సింగ్‌తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు కలిసి మాట్లాడాం. వారితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన 10 సంవత్సరాలు ప్రధాని పనిచేసినా.. ఏమీ సంపాదించులేన్నారు. మన్మోహన్ సింగ్ స్వతంత్రంగా పని చేయలేకపోయారు.” అని తెలిపారు.

READ MORE: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు