Manjummel Boys : ‘మంజుమ్మల్ బాయ్స్’ ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్, 6 ఏప్రిల్ 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. బహుళ భాషల్లో సినిమాలను నిర్మిస్తున్న ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈరోజు, మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. స్నేహితుల బృందం కొడైకెనాల్‌కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా. స్నేహితుల మధ్య బంధం సినిమాకి ప్రధాన డ్రైవింగ్ అంశం అవుతుంది, ట్రైలర్ కూడా అదే విషయాన్ని సూచిస్తుంది.
విజువల్స్, సెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. సినిమా సారాంశాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైన డబ్బింగ్ విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
‘హ్యాపీ-గో-లక్కీ యంగ్ ఫ్రెండ్స్ బ్యాచ్ తమిళనాడులోని కొడైకెనాల్‌కు డ్రీం టూర్ కి వెళ్తారు. వారు హిల్ స్టేషన్ తో పాటు కమల్ హాసన్ ‘గుణ’ చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్ ను ఎక్స్ ఫ్లోర్ చేస్తారు. దురదృష్టవశాత్తు, స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంటలలో ఒకదానిలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. మిగాతా అంతా ఆ వ్యక్తిని రక్షించే రెస్క్యూ మిషన్ గురించి. ట్రైలర్ సూచించినట్లుగా, చిత్రం కూడా హోప్, గ్రిట్ గురించి ఉంది. ఇది నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఓపెనింగ్ పార్ట్స్ బ్యాచ్ స్నేహాన్ని చూపిస్తే, చివరి సగం భావోద్వేగాలు, థ్రిల్స్‌తో నిండి ఉంటుంది. దర్శకుడు చిదంబరం సర్వైవల్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తీశారు.
పర్ఫెక్ట్ కాస్టింగ్ కథనానికి అథెంటిసిటీ తీసుకొచ్చింది. ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, షైజు ఖలీద్ కొడైకెనాల్ ల్యాండ్‌స్కేప్‌లను అద్భుతంగా తీశారు. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ మూడ్‌లను సెట్ చేస్తుంది. ట్రైలర్ చాలా ప్రామెసింగ్ గా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్‌కు బ్యాకింగ్ ఇవ్వడంతో సినిమా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. డబ్బింగ్‌లోని సూపర్‌లేటివ్ క్వాలిటీ మనకు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!