NTV Telugu Site icon

Bhubaneswar : చరిత్ర సృష్టించిన మనీషా పాధి.. దేశంలోనే మొదటి మహిళా ఏడీసీ

New Project (5)

New Project (5)

Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు. దేశంలోనే తొలి మహిళా ఏడీసీగా మనీషా గుర్తింపు పొందింది. మిజోరం గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభపాటి 2015 బ్యాచ్ ఎయిర్ ఫోర్స్ అధికారిణి మనీషా పాధిని తొలి మహిళా ఏడీసీగా నియమించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటి, “స్కాడ్రన్ లీడర్ మనీషా పాధిని సహాయకురాలిగా నియమించినందుకు ఆమెకు హృదయపూర్వక అభినందనలు” అని రాశారు. మరిన్ని శుభాకాంక్షలను తెలుపుతూ మనీషాకు ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు.

Read Also:Guntur Kaaram: సెకండ్ సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెరగనుంది…

మహిళల మద్దతు గురించి నొక్కిచెప్పిన గవర్నర్, మనీషా నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు, లింగ నిబంధనలను ఉల్లంఘించి, వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళల వేడుక కూడా.. ఈ సందర్భాన్ని చారిత్రాత్మక విజయంగా జరుపుకుందామన్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా బుధవారం తన పదవిని స్వీకరించి గవర్నర్‌కు నివేదించారు. ఇక్కడ ఆమె రాజ్ భవన్‌లో రాష్ట్ర అధికారులు, ఇతర ఉద్యోగులకు పరిచయం అయ్యారు. తొలుత ఏడీసీకి అధికారులంతా ఆమెకు ఘనస్వాగతం పలికారు. దీనికి ముందు మనీషా పాధి ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, బీదర్, భటిండాలో అనేక వివిధ హోదాల్లో పనిచేశారు. మనీషా ఇల్లు ఒడిశాలోని బహరంపూర్‌లో ఉంది. తన కుటుంబం భువనేశ్వర్‌లో నివసిస్తోంది. మనీషా సాధించిన ఈ ఘనతతో ఊరంతా సంతోషం వెల్లివిరిసింది.

Read Also:Tiger 3 : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?