Tiger 3 : టైగర్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.ఈ మూవీ లో కత్రినా కైఫ్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో టైగర్ 3 భారీ అంచనాల మధ్య రిలీజైంది. పైగా ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.టైగర్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా రెండో రోజుల్లోనే ఇండియాలో రూ.100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది..కానీ తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.
ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయినా కూడా ఇక్కడి ప్రేక్షకులు టైగర్ 3 ని పెద్దగా ఆదరించలేదు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించారు.బాలీవుడ్‍లో ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్స్ పై చర్చ సాగుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. దీంతో సల్మాన్ ఖాన్.. టైగర్ 3 కూడా ఆ రేంజ్‍లో వసూళ్లను రాబడుతుందని అభిమానులు అంతా అంచనాలు వేశారు. కానీ ఈ మూవీ అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. అయితే తాను బాక్సాఫీస్ నంబర్లను పెద్దగా పట్టించుకోనని సల్మాన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే టైగర్ 3 మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది..ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను టైగర్ మెప్పిస్తాడో లేదో చూడాలి
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!